Wednesday, August 19, 2020

పిడివాదులకు హెచ్చరిక

బీసీలు మనువాదులు అని నిర్ధారిస్తూ కొంత మంది ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు. దానికి మరి కొంత మంది విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. మొత్తం మీద వాళ్ళందరికీ ఒక నిశ్చితాభిప్రాయం ఉన్నది. అదే బీసీలు మనువాదులని.  ఈ విషయాన్ని ఒకసారి చెప్పి వొదిలెయ్యకుండా అవకాశం దొరికినప్పుడల్లా బీసీలే ద్రోహులు అనే విధంగా రాస్తున్నారు. 

బీసీలను టార్గెట్ చేసి రాసినట్లయితే కులానికొక్కడు సంఘటితంగా లేరు కాబట్టి తాము ఏమి రాసినా చెల్లుతుందని వారి విశ్వాసం. ఇదే పోస్టులు దళితుల మీద ఎవ్వరు పెట్టినా అట్రాసిటీ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది. 


అన్ని కులాల్లో, మతాల్లో చాందసులు ఉన్నట్టే, బీసీల్లోనూ ఉన్నారు. అయితే పనీ పాటా లేని కొందరు బీసీలనే టార్గెట్ చేస్తున్నరు. తాము బాబాల అవతారమెత్తి హితబోధ చేస్తూ ఉన్నారు. పదే పదే బీసీలను టార్గెట్ చేసి రాయడం వల్ల మనువాదం అంటే వ్యతిరేకత ఉన్న వాళ్లు కూడా హిందూత్వ వాదులుగా మారుతున్నారు. ఉద్యమకారుల పేరిట కొందరు 

భద్రాచలం రాములోరి గుల్లో పూజలు చేసినా, ఓరుగల్లు శివుని గుళ్లే నిద్ర చేసినా వాళ్ళను విమర్శించే సాహసం చేయరు. ఎందుకంటే నువ్ ఒక్క పోస్టు పెట్టీ సూడు ఎన్ని అట్రాసిటీ కేసులు ఎదుర్కోవాల్సి వస్తదో తెలుస్తది. 

బి.సీలు తేరగా దొరికిండ్రా? ఎమన్నా మూసుకోని పడి ఉండాల? దానికి మళ్ళీ అది మిమ్మల్ని కాదు అనే కవరింగ్ ఒకటి. మమ్మల్నీ మా సమూహాల నుంచి విడదీసే కుట్రలో భాగమా ఇది? మా సమూహాలను ఎటు నడిపించాలో మనువాదులకు వ్యతిరేకంగా ఎట్లా నిలబెట్టాలో మాకు తెలుసు ఎవరో చెబితే నేర్చుకోవాల్సిన స్థితిలో ఫూలే వారసులు లేరు.

బీసీ విద్యాంతులుగా, కవులుగా, రచయితలుగా, సెక్యులరిస్టులుగా, ఫూలె-అంబేడ్కర్ వాదులుగా మేమేమి చేయాలో మాకు తెలుసు. దయచేసి మా జోలికి రాకండి.. ఎంతసేపూ మామీద పడి ఏడ్సుడెనా? ఈ గురివింద నీతి మాకే ఎందుకు?

ఎవరినో అంటే మీకెందుకు కోపం అని వ్యాఖ్యానం.. ఇప్పుడు చెబుతున్నాము.. బీసీలుగా మేమంతా ఒక్కటే.. రాంగ్ రూట్లో పోయేటోళ్లని మేము పూలె- అంబేడ్కర్ మార్గం లోకి తెచ్చుకుంటాం. ఆ విశ్వాసం మాకుంది. మా అంతర్గత విషయాల్లో పరాయోడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదీ ప్రతిసారీ మీరు అజ్ఞానులు.. హిందూత్వ వాదులు అనే వారికి అస్సలే అవసరం లేదు.. 

మీమేలు కోసమే.. అనేది మరో జోడింపు.. చాలు చాలు మా మేలు మాకు బాగానే ఎరుక.. మీ నలుగురే ఎందుకు రియాక్ట్ అవుతారు అనేది మరో ప్రశ్న.. మీ సమాజమైనా...  మా సమాజమైనా ఎక్కడైనా మొదట మాట్లాడేది ఆ నలుగురే... ఇక ఆ నలుగురు మాట్లాడే వారి నోరు మూయించి ఇష్టా రాజ్యంగా.. అవహేళన చేస్తామంటే కుదరదు అంటే కుదరదు..  

  

ప్రతిసారీ బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా మీరంతా మనువాదులే అనే ప్రచారాన్ని పనిగట్టుకొని చేస్తూ ఉన్నారు.  నిజానికి మనువాద పార్టీ బి.జె.పిలో దళితులు లేరా? వర్గీకరణ కోసము వాళ్ళ కాళ్లు పట్టుకోలేదా? వాళ్ళపై ఒక్క పోస్టు పెట్టినా తొక్కి నార తీస్తరు.. అందుకే అన్నీ మూసుకొని ఉంటరు.. అదే బీసీలను అంటే ఎవ్వరేమీ పీకలేరని ధైర్యం.

మనువాద పార్టిలో బిసీలు ఎక్కువ ఉన్నరు.. కావొచ్చు.. బీసీల జనాభా ఎక్కువ కాబట్టి నేచురల్ గానే ఎక్కువ కనబడతరు..దీనికి చారిత్రక కారణాలు ఉన్నాయి.. 50యేండ్లు పాలన చేసిన కాంగ్రెస్ ఎన్నడూ బిసీలను పట్టీంచుకోలేదు.. వాళ్ళెప్పుడు దళిత్-ముస్లిం వోట్ బ్యాంక్ పైనే దృష్టిని నిలిపిండ్రు.. వారి హయాములో అంతో ఇంతో బాగుపడ్డది వాళ్ళే! నిజానికి జనాభా నిష్పత్తిలో చూస్తే కేంద్ర మంత్రివర్గములో అదేమనువాద బిజెపిలో పదవులు అనుభవిస్తున్నది.. బీసీలకన్నా దళితులే ఎక్కువ! వాళ్ళను టార్గెట్ చేసి ఒక్క పోస్టు పెట్టి సూడు.. ఆరె రంపె పదునెంతో తెలుస్తది..  

నిజాయితిగా, నిటారుగా, ఫూలె-అంబేద్కర్ వాదముతో ఉన్నవారి నోరు మూయ ప్రయత్నిస్తే, బట్టకాల్షి మీదేస్తే, బద్నాం చేస్తే తిరగబడక తప్పదు..కచ్చితంగా మా 53 శాతం సమూహం తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నది..       

నేను రెచ్చగొడితేనే వీళ్ళు స్పనించారు అనుకుంటే అది నీ అజ్ఞానము.. మా ఓపిక బలహీనత కాదు అని చెప్పడానికే ఈ హెచ్చరిక.. 

No comments:

Post a Comment